ప్రజాశక్తి - గుర్ల : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ ఎన్. రామకృష్ణ, తెలుగు అధ్యాపకులు రమా మాట్లాడుతూ తెలుగు వ్యవహారిక భాషను అభివృద్ధి పరచడంలో గిడుగు వెంకట రామమూర్తి కృషి ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, పిఒ ప్రసాద్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి: బొబ్బిలిలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థానం స్కూల్, శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాల, సురేష్ స్కూల్, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గిడుగు రామ్మూర్తి వేషధారణతో విద్యార్థులు అలరించారు. శ్రీవేణుగోపాల మున్సిపల్ పాఠశాలలో టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కౌన్సిలర్ సావు శారద నగదు బహుమతులు అందజేశారు. శ్వేతాచలపతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించి తెలుగు ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ ప్రాన్సిస్ జార్జ్, సిబ్బంది సన్మానించారు. శ్రీ కళాభారతి ఆడిటోరియం వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి రోటరీ క్లబ్ అధ్యక్షులు జెసిరాజు, కార్యదర్శి శ్రీహరి, రోటరీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
డెంకాడ: స్థానిక శాఖా గ్రంథాలయంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామమూర్తి పంతులు జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన గ్రంధాలయ సంస్థ కార్యదర్శి లలిత మరణం పాట్ల సంతాపం తెలిపారు. తెలుగు ఉపాధ్యాయుడు మహంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవను కొనియాడారు. లైబ్రేరియన్ మహేష్, పాఠకులు రామసూరి, పైడిరాజు, అనిల్, అప్పల నాయుడు, బంగార్రాజు, రామకృష్ణ పాల్గొన్నారు.
బాడంగి: స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు దత్తి సత్యన్నారాయణ తెలుగు భాష, క్రీడాదినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా హెచ్‌ఎం గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. పాఠశాలలో విద్యార్థులందరికీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఉత్తరావల్లి రామారావు ఆధ్వర్యంలో వ్యాసరచన, పద్య పఠనం, తెలుగులో అనర్గళంగా మాట్లాడడం, డిబేట్, డ్రాయింగ్ వంటి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు విజయమ్మ, నారెమ్మ ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
గరివిడి : తాటిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం, క్రీడా దినోత్సవాలను మంగళవారం నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. మధు సూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ తెలుగు చార్టుల ప్రదర్శన, క్రీడా ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు కె జ్యోతిశ్రీ, వ్యాయమ ఉపాధ్యాయులు బి. శ్రీకాంత్, విద్యారులు పాల్గొన్నారు.
చీపురపల్లి: చీపురుపల్లి పట్టణం జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు బాషా దినోత్సవం కార్యక్రమంలో ఎంపిపి ఇప్పిలి వెంకటనర్సమ్మ, జెడ్‌పిటిసి వలిరెడ్డి శిరీష, వైసిపి జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైస్ ఎంపిపి పతివాడ లక్ష్మీ, సర్పంచ్ మంగళగిరి సుధారాణి, పట్టణ పార్టీ అధ్యక్షులు పతివాడ రాజారావు పాల్గొని ఉపాధ్యాయులను సత్కరించారు.
శృంగవరపుకోట: విద్యార్థులు క్రీడలు, తెలుగుభాష పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. మంగళవారం మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ధ్యాన్‌చంద్ చిత్రపటానికి, తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్క రించుకుని గిడుగు రాంమూర్తి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్ధులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. రిటైర్డ్ తెలుగు మాస్టారు కె.బాబూరావు గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సన్యాసయ్య, స్కూల్ కమిటీ చైర్మన్ రమణ, సభ్యులు, ప్రధానోపాధ్యాయులు ఉమామహేశ్వర రావు, మామిడిపల్లి మాజీ సర్పంచ్ రమణ, నాయకులు జోగారావు మాస్టారు, రేవళ్లపాలెం వెంకటరావు, కిట్టు, అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు శాఖ ఆధ్వర్యంలో 'తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలుగు భాష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్. కేశవరావు, డాక్టర్ వి. యస్ కృష్ణ, ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ యస్.వి. రామారావు, వైస్ ప్రిన్సిపాల్ వాసుదేవరావు, అధ్యాపకులు డాక్టర్ స్వామి నాయుడు, డాక్టర్ సుధీర్, వలీఖాన్, ఈరన్న, భాస్కర్‌రావు పాల్గొన్నారు.
వంగర: స్థానిక శాఖా గ్రంథాలయంలో గిడుగు వెంకట రామ మూర్తి 160 జయంతి వేడుకలు గ్రంథాలయ అధికారి బివి రమణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గిడుగు వెంకట రామ మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
రామభద్రపురం: తెలుగు భాషా పరిరక్షణే అందరి ధ్యేయం కావాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు జెసి రాజు తెలిపారు. మంగళవారం నాయుడువలస పాఠశాలలో ఘనంగా భాషా దినోత్సవం నిర్వహించారు. అనంతరం గిడుగు రాంమూర్తి పంతులు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు రెడ్డి వేణు, రాజ శేఖర్, కృష్ణం నాయుడు పాల్గొన్నారు.
లక్కవరపుకోట: మండలంలోని జమ్మాదేవిపేట గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బిసి బాలికల గురుకుల పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాన్ని మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఆ పాఠశాల ప్రిన్సిపాల్ విజరు కుమార్ పాత్రో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు సిహెచ్ శ్రీజ, జి సాహితి ధరించిన భరతమాత, గిడుగు రామ్మూర్తి వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఇంద్రజ, ఆ పాఠశాల అధ్యాపకులు సుగుణ, యశోద, భార్గవి, విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: తెలుగు భాషా దినోత్సవాన్ని మంగళవారం గురజాడ పాఠశాలలో కరస్పాండెంట్ ఎం.స్వరూప, ప్రధానోపాధ్యాయులు పూడి శేఖర్, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలుగు ఉపాధ్యాయులు భాస్కరరావు, రామలక్ష్మి తెలుగు బాషా గొప్పతనాన్ని విద్యార్థులందరికీ వివరించారు. అలాగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు.
ఫోర్టు సిటీ పాఠశాలలో..
తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈనెల 23 నుంచి 29 వరకు తెలుగు భాషా వారోత్సవాలు జరిగాయి. విద్యార్థులకు పద్యపఠనం, కథలు-కవితలు, సామెతలు, వక్తృత్వం, క్విజ్, పాటలు తదితర అంశాల్లో పోటీలు నిర్వహించిగెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా 'హరే వీసమారా ధనమ్' వారు వివిధ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీలో ఫోర్టుసిటీ విద్యార్థులు ప్రతిభ కనబరచి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులు పొందారు. ధ్యాన్ చంద్ జన్మదినమైన జాతీయ క్రీడాదినోత్సవంలో భాగంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించి బహుమతు లను అందజేసారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ కెఎపిరాజు (శివ), వైస్ చైర్మన్ చంటి, ప్రిన్సిపల్ రీయినాఖాన్, డైరెక్టర్లు మధు, అశోక్, నీలిమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తెలుగు భాషను పరిరక్షించుకోవాలి
విజయనగరం కోట : తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతో ఉందని గాజులరేగ నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మొయిద నారాయణరావు అన్నారు. పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గిడుగు రామ్మూర్తి పంతులు ధ్యాన్చంద్ చిత్రపటాలకు పూలమాల అలంకరించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పిల్లలచే వారి పలకల పైన గిడుగు తెలుగు వెలుగు పిడుగు అనే అక్షర రూపంలో రాసి ప్రదర్శించారు.
వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఘనంగా మాతృ భాష దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ బి.వెంకటరావు మాట్లాడుతూ - గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి గిడుగు వెంకట రామమూర్తి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వి.అశోక్ కుమార్, ఎస్.భాస్కర రావు, గణేష్, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.ముందుగా తెలుగు తల్లి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శ్రీచైతన్య పాఠశాలలో..
శ్రీ చైతన్య రింగ్ రోడ్ బ్రాంచ్‌లో జరిగిన తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కథా రచయిత వి. వెంకట్రావు పాల్గొని గిడుగు రామ్మూర్తి గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రాంతీయ పర్యవేక్షకులు వి. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ బాబు, డీన్లు పాల్గొని విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు పాఠశాల పీఠాధిపతులు, కె. సత్యనారాయణ, ఏ. అప్పలనాయుడు, సూర్య చంద్ర, సాయి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఎదుగుదలకు చదివే ప్రామాణికం
వేపాడ : విద్యార్థుల ఎదుగుదలకు చదివే ప్రామాణికమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం, గిడుగు రామ్మూర్తి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా తమ సొంత నిధులతో గ్రంథాలయాన్ని తన చేతుల మీదుగా మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు, విన్యాసాలు తిలకించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వాలీబాల్ ఆడుకోవడానికి అవసరమైన నెట్, బాలు కావాలని కోరగా తన సోదరుడు గొంప వెంకటరావు వారం రోజుల్లో మీకు తెచ్చి అందజేస్తాడని కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుమ్మడి భారతి, సేనాపతి గణేష్, ఎల్ రవి ప్రసాద్, కృష్ణవేణి, పాల్గొన్నారు.
సోంపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బిపిఎ రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఎపి ఆదర్శ పాఠశాల, ఎన్‌కెఆర్ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.










