Aug 24,2023 21:25

ధర్నా చేస్తున్న టిడిపి, సిపిఎం నాయకులు, పోరాట సమితి సభ్యులు

ప్రజాశక్తి-మెంటాడ :  గుర్ల ప్రాజెక్టును పూర్తిచేయాలని స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం గుర్ల ప్రాజెక్టు పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు మాట్లాడుతూ పాతికేళ్లుగా గుర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయలేదన్నారు. రైతులకు సాగునీటికి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టుకు అవసరమైన అదనపు నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి రాకోటి రాములు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు గొర్లె ముసలినాయుడు, రెడ్డి రాజగోపాల్‌, గిరిజన సంఘం మండల కార్యదర్శి తామరాపల్లి సోములు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.