ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని అరమ పంచాయతీ బడిమెల గ్రామంలో రేషన్ కార్డులు తొలగించిన లబ్ది దారులతో బుధవారం ఆ గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర కమిటిసభ్యులు టి సూర్యనారాయణ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా సంక్షేమ పథకాలు పొందుతున్న పేద గిరిజనులకు 5ఎకరాల పైబడి భూములు ఉన్నాయని, కీల్లో అర్జున్, బురిడీ రామచంద్ర, కొర్ర పూర్బ్, కొర్ర మిన్ను, గోల్లోరి శ్రీనివాసరావు, గోల్లోరి రామచంద్ర, కొర్ర సహాదేవ్, గోల్లోరి గాసి అనే గిరిజనులకు ఇటీవల కాలంలో రేషన్ కార్డులు తొలగించడంతో రేషన్ కార్డు ద్వారా పొందుతున్న పథకాలు, నిత్యావసర సరుకులు, ఫించన్లు తొలగించడంతో తీవ్ర ఆందోళన చెందు తున్నారన్నారు.ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి ఉచిత సంక్షేమ పథకాల అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పు కొంటుంది తప్ప పూర్తిగా అమలు పరచ లేదన్నారు. ఈ కార్యక్రమంలో టి.రామారావు, జి.జగన్నాధం, కె రామకృష్ణ పాల్గొన్నారు.










