Aug 23,2023 22:35

గడిగెడ్డ నీరు విడుదల చేస్తున్న జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-గుర్ల :  మండలంలని గడిగెడ్డ ప్రాజెక్టు నుంచి బుధవారం సాగునీటిని జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిగెడ్డలో పూర్తిస్థాయిలో ప్రస్తుతం నీరు నిల్వ లేదని, ఉన్న నీటిని రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటిని వృథా చేయొద్దని కోరారు. కార్యక్రమంలో డిఎల్‌డిఎ చైర్మన్‌ బెల్లాన బంగారు నాయుడు, ఇరిగేషన్‌ డిఇ సంతోష్‌ కుమార్‌, జెఇ శ్రీనివాసరావు, తెట్టంగి పిఎసిఎస్‌ చైర్మన్‌ టివిఎన్‌ రాజు, వైస్‌ ఎంపిపి తిరుపతిరావు, పి.సన్యాసినాయుడు, ఎంపిటిసి బి.జోగినాయుడు, మాజీ సర్పంచ్‌ జమ్ము స్వామినాయుడు, మాజీ ఎంపిటిసి రాగోలు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.