రాఖీ కడుతున్న విద్యార్థిని
విజయనగరం టౌన్ : ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను కోట జంక్షన్ వద్ద బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కోట జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. పట్టణ పౌరులకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ గర్ల్స్ కన్వీనర్ లావణ్య మాట్లాడుతూ నిర్భయ , దిశ వంటి చట్టాలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని కాగితాలకే పరిమితం చేసి, విద్యార్థినుల రక్షణ గాలికి వదిలేశాయని దుయ్యబట్టారు. ఇటువంటి పరిస్థితిలో తమ తోటి విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత సహచర విద్యార్థుల మీద పడుతోందన్నారు. కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనింగ్ కమిటీ సభ్యులు సమీరా, సంధ్య, ఎర్రమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.హర్ష, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రాజు, పి.రమేష్ పాల్గొన్నారు.










