ఎమ్‌పి బెల్లాన
ప్రజాశక్తి-విజయనగరం : ఈ నెల 13న ఢిల్లీలో జరిగే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) సమావేశానికి ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్ హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కులాలు తమను ఒబిసి జాబితాలో చేర్చాలని చేసిన విజ్ఞప్తులను ఈ కమిషన్ పరిశీలించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తూర్పుకాపు, శిష్ట కరణం, కళింగ కోమటి, కళింగ వైశ్య, సొండి, అరవ తదితర కులాలు నుంచి, తమను ఒబిసి జాబితాలో చేర్చాలని విజ్ఞప్తులు అందించాయి. ఈ నేపథ్యంలో జరిగే కమిషన్ కీలక సమావేశానికి హాజరుకావాలని ఒబిసి కమిటీ సభ్యులుగా ఉన్న ఎమ్‌పి బెల్లానకు ఆహ్వానం అందింది.










