Aug 18,2023 21:18

నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - బొబ్బిలి రూరల్‌ : అలజంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాన్న భోజన నిర్వాకురాల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పాఠశాల వద్ద సిఐటియు ఆద్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకర్రావు మాట్లాడుతూ అలజంగి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భోజన నిర్వాహకరాలు పొట్నూరు సత్యవతిని రాజకీయ కారణాలతో తొలగించడం అన్యాయమన్నారు. పాఠశాలలో గత 16 సంవత్సరాల నుండి జీతం లేకపోయినా ఉచితంగా పనిచేసిన సత్యవతిని తొలగించడం అన్యాయమని కనీస వేతనం లేకపోయినా మెను చార్జీలు పెంచకపోయినా మధ్యాహ్న భోజనం నిర్వాహుకలు అప్పులు చేసి మధ్యాహ్నం భోజనం నిర్వహణ కొనసాగిస్తున్నారని అన్నారు. పొట్నూరి సత్యవతిని తొలగించడానికి త్రీ మాన్‌ కమిటీ వేసి మరీ తొలగించడం బాధాకరమన్నారు. నియోజకవర్గంలో అనేక సమ స్యలు ఉన్నాయని, రైతులు, కార్మికులు, ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలు పరిష్కారం చూపించలేని ఎమ్మెల్యే ఒక మధ్యాహ్నం భోజనం నిర్వాహకురాలను తొలగిం చడానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. ఆమెకు పని వెంటనే ఇవ్వాలని లేని పక్షంలో మండలమంతా మధ్యాహ్నం భోజనం బంద్‌ చేసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం మండల ప్రెసిడెంట్‌ రామ లక్ష్మి, ఉపాధ్యక్షులు డి. ఆదిలక్ష్మి చంద్రమ్మ పాల్గొన్నారు.