Aug 22,2023 20:46

వంగర: ఎంఇఒ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఎంఆర్‌సి సిబ్బంది

ప్రజాశక్తి - వేపాడ : మండల కేంద్రంలోని ఎంఆర్‌సిలో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎంఇఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భగా సిఆర్‌పిలు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరిస్తామని సిఎం జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ఇంత వరకూ పరిష్కరించలేదన్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు
వంగర: 2014 నాటికి సమగ్ర శిక్షా సొసైటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని వారంతా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు స్థానిక ఎంఆర్‌సి కార్యాలయం వద్ద మంగళవారం భోజనం విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై నెల జీతం బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల ఒకటవ తేదీకి వేతనాలు చెల్లించాలని, ఎంటిఎస్‌ అమలు చేసి వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు కిరణ్‌, తవిటినాయుడు, పారయ్య తదితరులు పాల్గొన్నారు.