Aug 20,2023 21:16

బ్రోచర్‌ను అందిస్తున్న ఎమెల్యే కడుబండి శ్రీనివాసరావు

ప్రజాశక్తి - కొత్తవలస : ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైసిపి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని దెందేరు గ్రామంలో ఆదివారం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. మరోసారి తనను, సిఎం జగన్మోహన్‌రెడ్డిని ఆశీర్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, పిఎసిఎస్‌ చైర్మన్‌ గొరపల్లి శివ, మండల పార్టీ అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, జెసిఎస్‌ ఇంచార్జిలు బొంతుల వెంకటరావు, మేలాస్త్రి అప్పారావు, పల్ల భీష్మ, పిఎస్‌ఎన్‌ పాత్రుడు, స్థానిక సర్పంచ్‌ విరోతి వెంకటరమణ, ఎంపిటిసి వెలగల రమణ, సంతపాలెం బి.ఏ నాయుడు, సచివాలయం కన్వీనర్‌ గొర్లె శ్రీను, ఈశ్వరరావు, గులివిందాడ గణేష్‌, ఉత్తరాపల్లి గణేష్‌, ఆతవ రమేష్‌, జామి సాల్మన్‌ రాజు, లెంక నర్సింగరావు మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ కర్రి దేవుడు బాబు, మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపిటిసిలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.