May 10,2023 11:34

ప్రజాశక్తి-అల్లూరి : ఈనెల 11అల్లూరి జిల్లా లో చలో కలెక్టరెట్ ధర్నా విజయవంతం చేయాలనీ మండల కేంద్రంలో అల్లూరి జిల్లా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్వి రాజ్ ఆధ్వర్యంలో గోడపత్రికాలను  గిరిజన సంఘం పూర్వపు అధ్యక్షుడు బొండా సన్నిబాబు  స్థానిక వైస్ సర్పంచ్ బి గంగాదరం సీఐటీయూ సిహెచ్ రామారావు మండల కమిటీ నాయకులు జె, సునీల్ ఆవిష్కరించారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృద్వి రాజ్ గిరిజన సంఘం కార్యాలయం మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం  ఇటీవల బోయ వాల్మీకిలను  గిరిజన జాబితాలో చేర్చాలని రాష్ట్ర అసెంబ్లీ లో చేసిన తీర్మానన్ని  వెంటనే రద్దు చేయాలనీ హెడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేయాలనీ  జి ఓ నంబర్ 3 కు చట్ట బద్దత కల్పించాలని  మైనింగ్ అనుమతులు రద్దు చేయాలనీ ఈనెల 11న అల్లూరి జిల్లా కలెక్ట్రెట్ పాడేరులో జరుగు ధర్నా జయప్రదం చేయాలనీ  చలో కలెక్ట్ రేట్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా గిరిజన సంఘం పూర్వపు అధ్యక్షులు బొండా సన్నీ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో ఉన్న అటవీ సంపదను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని నూతన అటవీ పాలసి తీసుకొచ్చి  బడా కార్పొరేట్  అంబాని ఆదానిలకు అడవి నంతటిని కట్టబెట్టాలని చూస్తుందన్నారు. చింతపల్లి ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రయివేట్ వ్యక్తులకు వ ప్పగించాలని  చూస్తుందని అనంతగిరి మండలంలో నిమ్మళపాడు గేనెట్ మైనింగ్ ని కూడా అమ్మేయ్యాలని బోయవాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చారాదనీ  అసలైన ఆదివాసి గిరిజనులకు నష్టం వాటిల్లా కూడదని  గిరిజన ప్రాంతంలో 1/70 పటిష్టంగా అమలు పరచాలని  అటవీ హక్కుల చట్టం పగడ్బెందిగా అమలు పరచాలని  పాలక ప్రభుత్వాల గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 11న చలో కార్యక్రమం గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా జయప్రదం చేయాలనీ  గిరిజన ఉద్యోగులు మేధావులు విద్యార్థి సంఘాలు ప్రజా ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలనీ పిలుపునిచ్చారు.