Sep 06,2023 22:05

ఎటిఎం కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్‌పి ఎం.దీపిక

ప్రజాశక్తి-గజపతినగరం :  గజపతినగరం సర్కిల్‌ పరిధిలోని గొట్లాం, మానాపురం వద్ద ఎటిఎం కేంద్రాల్లో మంగళవారం రాత్రి చోరీలు జరగగా, ఆయా నేర స్థలాలను జిల్లా ఎస్‌పి ఎం.దీపిక బుధవారం ఉదయం పరిశీలించారు. నేర స్థలాలను, నేరం జరిగిన తీరును, సిసి ఫుటేజులను పరిశీలించారు. బొబ్బిలి డిఎస్‌పి పి.శ్రీధర్‌, ఇంఛార్జి సిఐ ఎస్‌.తిరుమలరావు, సిసిఎస్‌ సిఐ ఎం.బుచ్చిరాజు, ఇతర పోలీసు అధికారులకు, క్లూస్‌ టీం అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎటిఎం చోరీలను వెంటనే చేధించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.