Sep 03,2023 21:49

మాట్లాడుతున్న గొంప కృష్ణ, వెంకటరావు

ప్రజాశక్తి - వేపాడ : చంద్రబాబు సిఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. మండలంలోని అరిగిపాలెంలో ఆదివారం రాత్రి టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజన్‌ ఉన్న నాయకుడు, అనుభవజ్ఞుడు, పాలనాదక్షత కలిగిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదన్నారు. 'బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ' మేనిఫెస్టోలోగల అంశాలన్నీ గ్రామంలో ప్రజలకు వివరించారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరికిపోయిందని, జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా వచ్చిన దాఖలాలు లేవని, మద్యం బాండ్లను తాకట్టు పెట్టి ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చారని ఆరోపించారు. బటన్‌ నొక్కడం తప్ప ఏ పథకమైనా సకాలంలో లబ్ధిదారులకు పూర్తిగా అందేలా కృషి చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను, భవనాలను తాకట్టు పెట్టి అప్పులు చేయడమే ఈ ప్రభుత్వ విధానమని ఎద్దేవా చేశారు. నిరుపేదలకు సెంటున్నర భూమిచ్చి జగన్‌రెడ్డి మాత్రం విశాలమైన కొండలపై భవనాలు నిర్మించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళితులను అన్నదమ్ములు, మేనకోడళ్ళు అని చెప్పి తానే మేనమామను అంటూ ముద్దులు పెట్టి ఇప్పుడు దళితులు పైన తప్పుడు కేసులు పెట్టి మానసికంగా హింసించడం చూస్తుంటే జగన్మోహన్‌ రెడ్డికి దళితులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ప్రత్యేక హోదా లేదు, నిరుద్యోగులకు ఉపాధి లేదు, భూకబ్జాలు, ఇసుక మాఫీయాలో మాత్రం ముందున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టిడిపి మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి, ఐటిడిపి మండల అధ్యక