కొత్తవలస: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వారానే యువత భవిష్యత్తుకు గ్యారెంటీ అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. శుక్రవారం రాత్రి కొత్తవలస మండలం సీతంపేట గ్రామంలో బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గొరపల్లి రాము ఆధ్వర్యంలో కృష్ణకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే బాగా అభివృద్ధి జరిగిందని అన్నారు. వైసిపి హయాంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.టిడిపి అధికారంలోకి వస్తే పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తారని అన్నారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు టిడిపి ఉపాధ్యక్షుడు లెంక శ్రీనివాసరావు, జామి మండల పార్టీ అధ్యక్షుడు లగుడు రవికుమార్, భీశెట్టి ప్రసాద్, పలువురు మాజీ సర్పంచులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










