ప్రజాశక్తి - వంగర : టిడిపి అధినేత చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి మండల నాయకులు శనివారం నిరసన తెలిపారు. అరసాడలో నియోజకవర్గం మహిళా అధ్యక్షులు లచ్చుబుక్త ధనలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బలిజిరెడ్డి శ్రీనివాసరావు, బెజ్జిపురం త్రినాధరావు, నియోజకవర్గం ఎస్‌సిసెల్ అధ్యక్షులు మజ్జి గణపతి, ఆవు తిరుపతిరావు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. కొత్తవలస జంక్షన్‌లో శనివారం రాస్తారోకో చేశారు. సిఐడి అక్రమంగా అరెస్ట్ చేసిన కారణంగా కొత్తవలస టిడిపి నాయకులు నల్ల బ్యాడ్జీలతో వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ, నినాదాలు చేశారు. ఈ సమయలో నాయకులకు, పోలీసులు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. శనివారం అర్ధరాత్రి నుంచే టిడిపి నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టిడిపి విశాఖ పార్లమెంటరీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు బొబ్బిలి అప్పారావు, మాకేన సీతారాం పాత్రుడు, మన టిడిపి అధ్యక్షుడు గొరపల్లి రాము, కార్యదర్శి కనకాల శివ, బీశెట్టి ప్రసాద్, తిక్కాన చినదేముడు, టిడిపి బీసీ సెల్ వెలమ సాధికార సమితి రాష్ట్ర డైరెక్టర్ రెడ్డి పైడంనాయుడు, కొరుపోలు అప్పారావు, లంక శ్రీను తదితర 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వేపాడ: వల్లంపూడి కూడలి వద్ద సుమారు 500మంది కాగడాలతో ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. మండలంలో టిడిపి నాయకులను ముందస్తుగా వల్లంపూడి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. టిడిపి మండల అధ్యక్షుడు గొంప వెంకటరావు, ఉపాధ్యక్షుడు పాతల రమణ, ప్రధాన కార్యదర్శి కొట్టియాడా వెంకటరమణ, మండల ఐటిడిపి అధ్యక్షుడు సేనాపతి గణేష్, మండల రైతు సంఘం ఉపాధ్యక్షుడు సిరికి రమణలను పోలీసులు నిర్భంతదించారు. డెంకాడ: మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు పల్లె భాస్కరరావు ఆధ్వర్యంలో శనివారం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజయనగరం నాతవలస రహదారిపై కొంత సేపు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ కాగితాల సత్యనారాయణ, నాయకులు పాణిరాజు, జిన్న శ్రీను, అప్పలనాయుడు, సత్యనారాయణ, పలు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పూసపాటిరేగ: టిడిపి మండల అధ్యక్షులు మహంతి శంకరరావు ఆధ్వర్యంలో శనివారం జాతీయ రహదారిపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజు వీధిలోని ఎన్‌టిఆర్ విగ్రహం వరకు ర్యాలీ చేస్తూ జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు ఇది పరాకాష్ట అంటూ నినాదాలు చేశారు. నిరసనలో రాష్ట్ర కార్యదర్శి గంగా భూలోక, నాయకులు దల్లి ముత్యాలరెడ్డి, పిన్నింటి సన్యాసి నాయుడు, పిన్నింటి శ్రీనివాసరావు పసుపులేటి గోపి, ఇజ్జురోతు ఈశ్వరరావు, విక్రమ్ జగన్నాథం, రౌతు స్వామి నాయుడు, మురపాల బోగేస్, కూనిశెట్టి గోవిందరావు, పిల్ల లక్ష్మీనారాయణ, కొత్తకోట వెంకటరమణ, బొంతు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల: స్థానిక రామతీర్థం జంక్షన్, జరజాపు పేట, రామతీర్థం గ్రామాల్లో టిడిపి నాయకులు శనివారం నిరసన ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా జరజాపుపేటలో టిడిపి పార్లమెంట్ మహిళా అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి, నగర పంచాయతిలో పట్టణ టిడిపి అధ్యక్షులు బైరెడ్డి లీలావతి, రామతీర్థంలో జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. జిల్లా సీనియర్ నాయకులు సువ్వాడ రవి శేఖర్, మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్ కుమార్‌ని విజయనగరంలో ముందస్తుగా పోలీసులు గృహా నిర్భందం చేశారు. టిడిపి జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, పార్ల మెంట్ కార్యదర్శి లెంక అప్పల నాయుడు, పోతల రాజప్పన్న, మండల తెలుగు యువత అధ్యక్షులు నల్లం శ్రీనివాసరావు, నాయకులు రెడ్డి వేణు, అట్టాడ శ్రీధర్, ఆల్తి నల్లిబాబుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. నిరసనలో పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి అవనాపు సత్యనారాయణ, చిల్ల పద్మ, చీకటి సుహాసిని, కోట్ల సునీత, కింతాడ కళావతి, పొడుగు కృష్ణ వేణి, పాల్గొన్నారు. రేగిడి: మండలంలోని ఉంగరాడ మెట్ట వద్ద మాజీ ఎంపిపి కిమిడి రామకృష్ణంనాయుడు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు నల్ల బ్యాడ్జీలతో శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు రేగిడి పోలీస్ స్టేషన్ చేరుకుని ఎస్‌ఐ శ్రీనివాసరావుతో మాట్లాడారు. వీరితోపాటు టిడిపి నాయకులు లావేటి సత్యంనాయుడు, రాంబాబు, మహేష్, పైల వెంకటరమణ, వంగర, రేగిడి టిడిపి నాయకులు ఉన్నారు. గంట్యాడ: తెలుగు రాష్ట్రాలకు అనేక సేవలు అందించిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాపారవేత్త కొండపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్‌ఐఆర్ కాపీలో పేరు లేకుండా, సరైన నోటీసులు లేకుండా, ఎటువంటి వివరణ కోరకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఒక హై ప్రొఫైల్ భద్రత కలిగిన వ్యక్తిని ఇలా అర్ధరాత్రి చుట్టుముట్టి మూకుమ్మడిగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. దీన్ని కేవలం రాజకీయ అణిచివేత చర్యగా భావిస్తున్నామని వెల్లడించారు. బాడంగి: గజరాయునివలస ఎంపిటిసి, రాష్ట్ర ఎస్‌టి సెల్ జనరల్ సెక్రటరీ పాలవలస గౌరు శనివారం ఏరుకులపాకలో ఆందోళణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన్ను బాడంగి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. జామి: నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుమీద అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు జాగారంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌లో టిడిపి నాయకులు నిరసన చేపట్టారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన నాయకులు వైసిపి ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి నిరంకుశ పాలనకు ఇది పరాకాష్ట అంటూ నినాదాలు చేశారు. నిరసనలో మండల యువజన అధ్యక్షులు రాయవరపు శంకర్రావు, జామి మాజీ సర్పంచ్ ఇప్పాక వెంకట త్రివేణి, కొత్తలి సూర్యారావు, రామయ్యపాలెం మాజీ సర్పంచ్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మాజీ జెడ్‌పిటిసి బండారు పెదబాబు, టిడిపి మండల అధ్యక్షులు లగుడు రవికుమార్, వి.రమణ తదితరులను ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో నిర్బంధించారు. బొండపల్లి: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా శనివారం మండల సముదాయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి సిఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా తొలుత మండల టిడిపి అధ్యక్షుడు కోరాడ కృష్ణ, మాజీ జెడ్‌పిటిసి బండారు బాలాజీలను అరెస్టు చేశారు. లక్కవరపుకోట: అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా 92 వేల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చినందుకా చంద్రబాబును అరెస్టు చేశారా? అని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రశ్నించారు. తమ నాయకుడి అరెస్టుపై స్పందించిన ఆమె స్వగృహంలో శనివారం విలేకర్లతో మాట్లాడారు. టిడిపికి ప్రజలు బ్రహ్మరథం పెట్టడం, పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇటువంటి నీచమైన దుశ్చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. దీనికి ముందు ఆమెను పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పలరాంప్రసాద్, మాజీ ఎంపిపి రమణమూర్తి, మాజీ జెడ్‌పిటిసి కరెడ్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోట: నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుమీద అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు పట్టణంలోని దేవి కూడలిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ నాయకులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో నిర్వహిస్తున్న నాయకులను ఎస్‌కోట సిఐ బాల సూర్యారావు, ఎస్సై తారకేశ్వరరావు, మరో ఎస్సై లోవరాజు తమ సిబ్బందితో అరెస్టు చేసి పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు. గజపతినగరం: మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద టిడిపి నాయకులు శనివారం ఆందోళన చేశారు. అనంతరం పోలీసులు కెఎ నాయుడుతో సహ పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మెరకముడిదాం: మాజీ ఎంపిపి, ప్రస్తుత టిడిపి మండల అధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడును పోలీస్ సిబ్బంది శనివారం గృహ నిర్ణబంధం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభ కోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడును సిఐడి సిబ్బంది అరెస్ట్ చేసిన సందర్భంగా మండలంలో ప్రజలకు శాంతి భద్రతలకు విఘాతం కలగ కుండా ఉండెందుకు ముందస్తుగా గృహనిర్భందం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బొబ్బిలి: అక్రమ కేసులతో చంద్రబాబు అరెస్టు దుర్మార్గమని టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేప్పట్టేందుకు టిడిపి నేతలు సిద్ధమవ్వగా బేబినాయనను, పట్టణ అధ్యక్షులు రాంబార్కి శరత్‌ను కోటలో పట్టణ సిఐ ఎం.నాగేశ్వరరావు హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు నిర్బంధాన్ని తప్పించుకున్న బేబినాయన ఎన్‌టిఆర్ బొమ్మ వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించడంతో కోటలో బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఆర్‌టిసి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ప్రధాన కూడలిలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చీపురుపల్లి : చీపురుపల్లిలో నియోజకవర్గ ఇంచార్జ్ కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో, పార్టీ శ్రేణులు శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారులు మీదుగా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రౌతు కామునాయుడు, పైల బలరాం, చనమల మహేశ్వర రావు, సారేపాక సురేష్ బాబు,రెడ్డి గోవింద, ముల్లు రమణ, రౌతు నారాయణరావు, మహంతి రమణమూర్తి, కుమిలి శ్రీను, గవిడి నాగరాజు, శ్రీను, శనపతి శ్రీనివాస రావు, బలగం వెంకట రావు, వెంపడాపు రమణ మూర్తి, మహాంతి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










