Sep 04,2023 21:28

గ్రామంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - పూసపాటిరేగ :  పూసపాటిరేగ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు మహంతి శంకర్రావు ఆధ్వర్యంలో ' భవిష్యత్తుకు గ్యారెంటీ - బాబు ష్యూరిటీ' కార్యక్రమంలో భాగంగా శిక్షణ కార్యక్రమం జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని కొన్ని ఇళ్లను సందర్శించి మినీ మానిఫెస్టోపై వివరించారు. కార్యక్రమంలో పార్లమెంట్‌ టి ఎన్‌ టి యు సి అధ్యక్షులు విక్రమ జగన్నాధం, చౌడవడ ఎంపిటిసి పసుపులేటి గోపి , మాజీ సర్పంచ్‌ పిన్నింటి సన్యాసినాయుడు, ఎంపిటిసి పిన్నింటి నాగరాజు, మాజీ ఎంపిటిసి సభ్యులు మురపాల బొగేస్‌, మాజీ ఉప సర్పంచ్‌ పిడిఎ ప్రసాద్‌, నాయకులు పిన్నింటి అప్పలనాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గం తెలుగుయువత అధ్యక్షులు పిన్నింటి కిషోర్‌, భోగాపురం తెలుగుయువత అధ్యక్షులు సరగడ తోగులురెడ్డి, ఆర్‌ టి ఎస్‌ నియోకవర్గ కోఆర్డినేటర్‌ నల్లం శ్రీనివాసరావు , ఓటరు వెరిఫికేషన్‌ నియోకవర్గ కోఆర్డినేటర్‌ కాళ్ళ రాజశేఖర్‌ ,పార్లమెంట్‌ తెలుగుయువత అధికార ప్రతినిధి చందక ఆనంద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.