Aug 19,2023 20:52

తుంపర్ల సేధ్యాన్ని పరిశీలిస్తున్న పీడీ లక్ష్మీనారాయణ

ప్రజాశక్తి- శృంగవరపుకోట : బిందు, తుంపర సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేయవచ్చునని ఎపి ఎంఐపి పీడీ పి.ఎన్‌.వి లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని ముషిడిపల్లి గ్రామంలోని రైతు గార్లపాటి సత్యసాయికి రాయితీపై అందించిన తుంపర సేద్యం యూనిట్‌ను శనివారం ఆయన పరిశీలించారు. మెట్ట ప్రాంతంలో పంటల సాగుకు బిందు, తుంపర్ల సూక్ష్మ సేంద్రియ విధానాలు లాభదాయకమని అన్నారు. మండల ంలో 24 మంది రైతులకు రూ.4.86 లక్షలతో 56 సూక్ష్మ సేద్య యూనిట్లను మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్‌ హార్టికల్చర్‌ అధికారి ఎం లావణ్య ప్రభ, ఎంటి ఏఓ మూర్తి, వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నవధాన్యాల సాగుతో నేల తల్లికి ఆరోగ్యం
నవధాన్యాల సాగుతో నేలతల్లి ఆరోగ్యం కాపాడవచ్చునని రీజనల్‌ ప్రకృతి వ్యవసాయ అధికారి హేమ సుందర్‌ అన్నారు. శనివారం మండలంలోని వినాయక పల్లి గ్రామంలో మండల వ్యవసాయ అధికారి రవీంద్ర ఆధ్వర్యంలో పలు పంట పొలాలను పరిశీలిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల గట్లు పై బంతి, కంది, చిక్కుడు, బెండ బహుళ పంటలు పసుపు పల్లాలు, చేసి జీవామృతం కవర్‌ పెట్టాలన్నారు. ప్రకృతి వనరుల కేంద్రంలో కషాయాలు వృద్ధి ద్రావణంల తయారీ, సరఫరా చేయాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎఎ రవి, రైతులు పాల్గొన్నారు.