Sep 06,2023 20:24

బెంచీలను ప్రారంబిస్తున్న నాయకులు

ప్రజాశక్తి- బాడంగి: మండలంలోని గజరాయునివలస గ్రామంలో కోట ఈశ్వరరావు 45 గార్డెన్‌ బెంచీస్‌ను(సిమెంట్‌ బెంచీలు) ప్రతి వీధిలోనూ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి వితరణ చేశారు. ఎంపిటిసి పాలవలస గౌరి, సర్పంచ్‌ ముడడ్ల సత్యం, గ్రామ పెద్దలతో వీటిని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపిటిసి, సర్పంచ్‌ మాట్లాడుతూ గతంలో కూడా గజరాయినివలసలో దేవి విగ్రహం దసరా నవరాత్రులో భాగంగా స్టేజి, పెండల్స్‌ టెంట్స్‌, మొత్తం స్టేజి సెట్‌కి సుమారు రూ.5లక్షలను కోట ఈశ్వరరావు సొంత నిధులను సేవభావంతో ఖర్చు చేశారన్నారు. ప్రతి సంక్రాతికి గ్రామంలో ఆటలు పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహణ నిమిత్తం సుమారు రూ.లక్ష సొంత నిధులను సేవా దృక్పధంతో ఖర్చు చేస్తూ పుట్టిన ఊరికి తనవంతుగా సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లగుడు సత్యం నారాయణ, మాజీ ఎంపిటిసి తెర్లి కామునాయుడు, ఉప సర్పంచ్‌, టిడిపి నాయకులు గునుపూరు కృష్ణ, రెడ్డి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.