Aug 26,2023 19:59

తరగతి గదిని పరిశీలిస్తున్న డిఇఒ లింగేశ్వరరెడ్డి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని దాసన్నపేటలోగల బాలికోన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి శనివారం పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 8వ తరగతి విద్యార్థులకు అందించిన ట్యాబ్‌ల ఉపయోగం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు రికార్డును పరిశీలించారు. విద్యా బోధన, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీ లేదని, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మెనూ అమలు చెయాల్సిందేనని అన్నారు. ఆయన వెంట ఎంఇఒ రాజు ఉన్నారు.