ప్రజాశక్తి - నెల్లిమర్ల : సమాజంలో ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని ఛాన్సెలర్ ప్రొఫెసర్ జిఎస్‌ఎన్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, స్టెప్ ఇన్ ఫర్ హెల్ప్ సంస్థల సహకారంతో అవయవాల దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ మనిషి చనిపోయిన తరువాత కూడా మరొకరికి ఉపయోగ పడటం గొప్ప విషయమన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కెఆర్‌డి ప్రసాద్ మాట్లాడుతూ మనిషి లాగే చెట్లకు ప్రాణం వుందని వాటిని చూసైనా మనిషి ప్రేరణ పొంది అవయవాల దానానికి ముందుకు రావాలన్నారు. సిఐ డి. బంగారుపాప అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చారు. ప్రముఖ అడ్వకేట్ ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ రాజు మాట్లాడుతూ పురాణాలలో శిబి చక్రవర్తి అవయవ దానం చేసారని గుర్తు చేశారు. డాక్టర్ ఎఆర్‌కె నాయుడు ఎన్ని రకాల అవయవ దానాలు చేయవచ్చునో వివరించారు. అనంతరం ఐదు అవయవాలను దానం చేసిన సంతోష్ తల్లి దండ్రులను, అతిధులను ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ రావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి ఎ. సత్యం, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ఎస్ వర్మ, ఐక్యూఎసి డీన్ ప్రొఫెసర్ పిఎస్‌వి రమణారావు, డీన్ ప్రొఫెసర్ ఎంఎల్‌ఎన్ ఆచార్యులు, డీన్ డాక్టర్ సన్నీ డియోల్, ప్రొఫెసర్ శాంతమ్మ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
ఆరోగ్యమే.. మహా భాగ్యం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అసోసియేట్ డీన్ డాక్టర్ కె. విజరు కుమార్ అన్నారు. మంగళవారం సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 80 శాతం వ్యాధులు కేవలం పరిశుభ్రత లేక బాక్టీరియా వల్ల కలుగుతున్నాయన్నారు. మనం పరిశుభ్రత పాటిస్తే అవి దరి చేరవన్నారు. పరిశుభ్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ ఎస్ వర్మ, డీన్ ప్రొఫెసర్ ఎంఎల్‌ఎన్ ఆచార్యులు, హౌస్ కీపింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










