Aug 19,2023 20:47

కొత్తవలస: గ్రామాల్లో సర్వేను పరిశీలిస్తున్న సాయికుమార్‌, తదితరులు

ప్రజాశక్తి- బొబ్బిలి : అవగాహన తోనే దోమల వ్యాప్తి నియంత్రణ సాధ్యమని త్రిబుల్‌ ఎస్‌ డిగ్రీ కాలేజీ వ్యవస్థాపకులు, విశ్రాంత ఉద్యోగుల నాయకులు రౌతు రామ్‌ మూర్తి అన్నారు. శనివారం త్రిబుల్‌ ఎస్‌ డిగ్రీ కాలేజీలో బొబ్బిలి రోటరీ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు దోమల వ్యాప్తి-నియంత్రణ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని మెంబర్షిప్‌ రీజినల్‌ చైర్‌ చంద్రకిశోర్‌, కోసాధికారి శ్రీనివాసన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వ్యాపి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రోటరీ క్లబ్‌ అధ్యక్షులు జెసి రాజు మాట్లాడుతూ దోమకాటు వల్ల మలేరియా, డెంగీ, పైలేరియా, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా, ఎల్లో ఫెవర్‌ తదితర జ్వరాలు బారిన పడతారని చెప్పారు. ఇంటి, కళాశాలలు, పాఠశాలల పరిసరాలు మురుగు నీరు నిల్వ లేకుండా చేయాలని, కొబ్బరి బొండాలు, పాత టైర్లు వాడకుండా ఉన్న నీటి ట్యాంక్‌ లలో నీరు నిల్వ లేకుండా చేయాలన్నారు. అనంతరం హెర్బల్‌ చుక్కల బాటిల్స్‌ను హాజరైన 400 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు శ్రీహరి, కె నాగరాజు, రామకృష్ణ, డేవిడ్‌ జె విక్టర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ మోహన రావు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట :దోమల వంటి చిన్న ప్రాణాలు వల్లనే పెద్ద హాని సంభవిస్తుం దని దోమల వల్ల మలేరియా, డెంగీ తదితర జ్వరాలతో ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని, లార్వా దశలోనే దోమల వ్యాప్తిని నిరోధించి అప్రమ త్తంగా ఉండాలని రాష్ట్ర కన్సల్టెంట్‌ సాయికుమార్‌ పిలుపునిచ్చారు. ఎస్‌.కోట శివారు పుణ్యగిరి గ్రామంలో దోమల దినోత్సవం పురస్కరించుకుని శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దోమలు పెరిగే అవకాశాలు లేకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవా లన్నారు. ఖాళీ టైర్లు, కొబ్బరి బోండాలు, కుండలు, గోలాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోy ాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంఒ డివి రమణ, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు, పర్యవేక్షకులు శ్రీనివాసరావు, రాజశేఖర్‌, ఎంఎ శంకరరావు, ఎంఎల్‌హెచ్‌పి సుశీల, ఏఎన్‌ఎం పార్వతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
కొత్తవలస: వియ్యంపేట పిహెచ్‌సి పరిధిలో వియ్యంపేట, ముసిరామ్‌ గ్రామాలలో ఎన్‌విడిసి స్టేట్‌ కన్సల్టెంట్‌ జి సాయికుమార్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో పర్యటించి కీటక జనిత వ్యాధులు డెంగీ, మలేరియా, ఫ్రైడే డ్రై నిర్వహణ, గ్రామాలలో వ్యాధులు పై అవగాహనా కార్యక్రమాలు జరిగే తీరు పై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య సిబ్బంది గ్రామాలలో ప్రతీ రోజు పర్యటించి నీటి నిల్వ ఉన్న ప్రదేశాలు, టైర్లు, కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్‌ డబ్బాలు ఇంటి ముందు ఉండకుండా చూడాలని, జ్వరాలు పై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వియ్యంపేట వైద్యులు బి. సింహాద్రి నాయుడు, అసిస్టెంట్‌ మలేరియా ఆఫీసర్‌ డేగల వెంకట రమణ, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ బి. శ్రీనివాసరావు, ఎంఎస్‌టి. రాజశేఖర్‌, ఇఒ నరసింహారావు పాల్గొన్నారు.