ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో మండల కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎ.జగన్మోహన్‌రావు పిలుపునిచ్చారు. మంగళ వారం ఎన్‌పిఆర్ భవన్‌లో ఆటో యూని యన్ నాయకులు లక్ష్మణరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈసందర్భంగా జగన్మోహన్‌రావు మాట్లాడుతూ రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం జరిగే ఉద్యమంలో ఆటో డ్రైవర్లంతా పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలకు కార్పొరేట్ల ప్రయోజనాల తప్ప, రవాణారంగ కార్మికుల సమస్యలు పట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్ల భద్రత పేరుతో డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించారని, వాహన మిత్ర రూ.10వేలు ఇచ్చి డీజిల్, పెట్రోల్, ఈ చలానాలు, ఇన్సూరెన్స్, రెన్యువల్స్ ఫీజులు పెంచి వేళల్లో దోచుకుంటు న్నారని అన్నారు. డ్రైవర్లు అప్పులు పాలై ఆటోలో అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడు తుందని అన్నారు. అందుకే కేరళ తరహాలో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు, డ్రైవర్లకు ఆటోనగర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని నిర్మించేం దుకు సెప్టెంబర్ 16, 17తేదీల్లో కర్నూల్‌లో రాష్ట్ర వర్క్‌షాప్ లో చర్చిస్తామన్నారు. ఈ చలానా రద్దు కోసం, పార్కింగ్ స్థలాలు, పెట్రోల్, డీజిల్ జిఎస్‌టి పరిధిలోకి తేవాలని, డ్రైవర్లకు ఇళు ,ఇళ్ల స్థలాలు, లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్‌కూ వాహన మిత్ర అమలలు కోసం సెప్టెంబర్ 5, 6, 7 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సత్యారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.










