ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని విటి అగ్రహారంలో నూతనంగా నిర్మించిన వైఎస్‌ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ విజయలక్ష్మి గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు 25 వేల మంది జనాభా కలిగిన ఈ ప్రాంతానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రాంతంతో పాటు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఈ ఆరోగ్య కేంద్రం ఉపయోగకరమన్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు జరిపామన్నారు. పేదలు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదని.. వారి చెంతకే వైద్య సేవలు తీసుకు వెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. ఆసుపత్రి సేవలను ప్రజలంతా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయా యాదవ్, కమిషనర్ శ్రీరాములు నాయుడు, కార్పొరేటర్ చండు పార్టీ నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.










