ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని మేయర్ విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. 8 డివిజన్లకు సంబంధించి 590 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. అనంతరం మాట్లాడుతూ అమ్మఒడి, ఆసరా, చేయూత, రైతు భరోసా, వాహన మిత్ర,విద్య కానుకలు, విద్యా దీవెన వంటి అనేక పథకాలను అందిస్తూ పేదలను ఆదుకునే రీతిలో పాలన సాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముచ్చు లయా యాదవ్, ఫ్లోర్‌లీడర్ ఎస్‌వివి రాజేష్, సహాయ కమిషనర్ ప్రసాదరావు, కార్పొరేటర్లు కంటుభుక్త తవిటి రాజు, వైసిపి నాయకులు ఎవర్ణ కుమారస్వామి, బొంగు భానుమూర్తి, టిపిఆర్‌ఒ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
40వ డివిజన్‌లో గడప గడపకూ..
40వ డివిజన్ కంటోన్మెంట్ బొగ్గుల దెబ్బ ప్రాంతం నుండి ప్రారంభమైన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కోలగట్ల తమ్మన్న శెట్టి పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల తీరును అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యల పైన ఆరా తీశారు. అర్హత ఉండి పథకాలు పొందలేని వారి వివరాలను తెలుసుకుంటూ అందుకు గల కారణాలను తెలుసుకున్నారు. స్థానిక కార్పొరేటర్ ధనలక్ష్మి, జోనల్ ఇన్చార్జి దూబే , వైసీపీ నాయకులు గాలి భాస్కరరావు, మురళి, డివిజన్ ఇంచార్జ్ వాసుదేవరావు, మహిళా అధ్యక్షురాలు నందిని, యువజన విభాగం అధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.










