Sep 08,2023 19:22

మంటలను ఆర్పుతున్న ట్రాఫిక్‌ పోలీసుసిబ్బంది

ప్రజాశక్తి-విజయనగరం కోట :  స్థానిక ఆర్టీసి కాంప్లెక్స్‌ వద్ద శుక్రవారం అరబిందో కంపెనీకి చెందిన బస్సు, తమ కంపెనీ ఉద్యోగులను తీసుకొని వెళ్తూ, ఇంజనులో సాంకేతిక లోపం కారణంగా పొగలుతో మంటలు వచ్చాయి. అక్కడ ట్రాఫిక్‌ రెగ్యులేషన్‌ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎ.ఎం.రాజు, సిబ్బంది సమయానుకూలంగా వ్యవహరించి, స్థానిక ఆటో డ్రైవర్ల సహకారంతో బస్సులోగల ఉద్యోగులను సురక్షితంగా దింపి, బస్సు మంటలను ఫైర్‌ ఇంజిన్‌ సహాయంతో ఆర్పడానికి ప్రయత్నం చేశారు. అనంతరం, రహదారి మధ్యలో ఆగిన బస్సును ఆటో డ్రైవర్ల సహకారంతో పక్కకు తొలగించి, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఎ.ఎం.రాజును, సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు.