Aug 22,2023 21:35

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  ప్రైవేట్‌గా నడుపుతున్న స్కానింగ్‌ కేంద్రాలను పిసిపి ఎన్‌డిటి కమిటీ సభ్యులు తరచుగా తనిఖీలు చేయాలని, నిబంధన మేరకు నడపని స్కానింగ్‌ కేంద్రాలను మూసివేయాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పిసిపి ఎన్‌డిటి జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన జరిగింది. కొత్తగా స్కానింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు 5 దరఖాస్తులు, రెన్యూవల్‌ కోసం 4 దరఖాస్తులు అందినట్లు డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ భాస్కర రావు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను కలెక్టర్‌ పరిశీలించడమే కాకుండా కమిటీ సభ్యులతో కూడా తనిఖీ చేయించి అనుమతిచ్చారు. అనంతరం మాట్లాడుతూ ఇద్దరు పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ పాటించేలా చూడాలని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే గర్భ స్రావాలను సమీక్షించాలని అన్నారు. సఖి గ్రూప్‌ లకు గర్భ స్రావాల వలన జరిగే నష్టాల పై అవగాహన కలిగించాలని అన్నారు. సమావేశంలో డిఐఒ డాక్టర్‌ అచ్యుతకుమారి, దిశ ఎస్‌ఐ పద్మావతి, పిపి జయలక్ష్మి, నేచర్‌ సంస్థ ప్రతినిధి దుర్గ, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.