Sep 08,2023 21:54

బరువు తక్కువ ఉన్న పిల్లలను పరిశీలిస్తున్న ట్రెయినీ కలెక్టర్‌ వెంకట్‌

ప్రజాశక్తి-వంగర :  మండలంలోని శివ్వాం అంగన్వాడీ - 1, 2 కేంద్రాలను ట్రెయినీ కలెక్టర్‌ సహదిత్‌ వెంకట్‌ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ రెండు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరాతీశారు. బరువు తక్కువ గల పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వివరాలు సేకరించారు.
బాగా బరువు తక్కువ ఉన్న ఇద్దరు పిల్లలను గుర్తించి, వారి ఆరోగ్యం బాగా మెరుగుపరిచేందుకు విజయనగరంలోని ఎన్‌ఆర్‌సికి పంపించాలని సూచించారు. ముందుగా తహశీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ పిఒ కనకదుర్గ, ఎంపిడిఒ వావిలపల్లి శ్రీనివాసరావు, డిటి బి.సుందరరావు, ఎంఆర్‌ఐ జామి మురళి, వైద్యాధికారి సుష్మత డయానా, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎల్‌.నారాయణరావు పాల్గొన్నారు.