Aug 24,2023 21:27

నిరసన చేపడుతున్న నగర పంచాయతీ కార్మికులు, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - నెల్లిమర్ల :  ఛలో విజయవాడ కార్యక్రమాన్ని భగం చేస్తూ అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు అన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం నగర పంచాయతి కార్మికులు చలో విజయవాడ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తన పాదయాత్రలో హామీ ఇచ్చి మరిచి పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ఏపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు టి. బాబూరావు, హరిబాబు, ఎం. దుర్గారావు, లక్ష్మీ, శశిరేఖ, శ్రీని వాసరావు తదితరులు పాల్గొన్నారు.