ప్రజాశక్తి - కొత్తవలస : వైసిపి ప్రభుత్వంలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని రెల్లి గ్రామంలో సుమారు రూ.90 లక్షలతో నిర్మించిన మూడు నూతన భవనాలను జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రెల్లి గ్రామంలో సర్పంచ్ అల్లం సత్యన్నారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన గ్రామంలో రూ.90 లక్షల నిధులతో నిర్మించిన, సచివాలయం, హెల్త్ క్లినిక్ సెంటర్, వెల్ నెస్ సెంటర్ మూడు భవనాలను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల అమలు చేస్తుందని వాటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన మన తలరాతలు మారలేదని, రాష్ట్రంలో వైఎస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన పిల్లల భవిష్యత్తు మారిందని అన్నారు. రాష్ట్రంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విజన్ 24 అని ప్రగల్బాల్ పలుకుతున్నారని వాటిని ఎన్నటికీ నమ్మరాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మూకల కస్తూరి, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, పిఎసిఎస్ చైర్మన్ గొరపల్లి శివ, మండల పార్టీ అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, జెసిఎస్ మండల ఇంచార్జ్ బొంతుల వెంకటరావు, మేలస్త్రి అప్పారావు, గొరపల్లి రవి, మండల యువజన విభాగం అధ్యక్షుడు ఐతంశెట్టి అనిల్ కుమార్, పి ఎస్ ఎన్ పాత్రుడు, స్థానిక సర్పంచులు జోడు రాములమ్మ, అల్లం సత్యనారాయణ, ఎంపిటిసి ఉగ్గిన గురూజీ, ఉగ్గిన రాంబాబు, ఉగ్గిన పద్మనాభం, పల్లా భీష్మ, ఆదిరెడ్డి అప్పన్న, తుమ్మికాపల్లి సర్పంచ్ కొండలరావు, ఎండి నాయుడు, గనిశెట్టి పాలెం ఈశ్వరరావు, ఉత్తర పల్లి గణేష్, గోపిశెట్టి శ్రీనివాసరావు, వెంకన్న పాత్రుడు, జామి సాల్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
విలేజ్ క్లినిక్‌లతో మెరుగైన వైద్య సేవలు
రామభద్రపురం: వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లతో గ్రామాల్లో మెరుగైన ఉచిత వైద్య సేవలు సాధ్యపడతాయని ఎమ్మెల్యే ఎస్‌వి చిన అప్పలనాయుడు అన్నారు. మండలంలోని గొల్లపేట, తారాపురం గ్రామాల్లో సుమారు రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజలకు సత్వర వైద్య సేవలు అందజేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగనన్న ఈ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారనీ వీటిని సద్వినియోగం చేసుకొని మెరుగైన వైద్య సేవలు పొందాలని సూచించారు. అనంతరం మండల కేంద్రం శివాలయం వద్ద నూతనంగా 7లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కల్వర్టు, డ్రైన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు, జెడ్‌పిటిసి అప్పికొండ సరస్వతి, సర్పంచ్ కడుపుకూటి రమ్య, ఎంపిటిసి శిష్ఠు రమణమ్మ, పిఎసిఎస్ అధ్యక్షుడు కిర్ల చంద్రశేఖర్, మండల జెసిఎస్ కన్వీనర్ చింతల సింహాచలం నాయుడు, వైసిపి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
రూ. 30వేలు అందజేత
బొబ్బిలి: తెర్లాం మండలంలోని నందిగాం గ్రామంలో మసీదు రిపేరు నిమిత్తం వాక్ఫ్ బోర్డు నుంచి రూ. 30వేలు చెక్కును ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు మసీదు కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, సీనియర్ కౌన్సిలర్ పాలవలస ఉమా, జిల్లా మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు.










