Sep 02,2023 18:50

పనులు పరిశీలిస్తున్న ఇంజినీరింగ్‌ అధికారి గణపతిరావు

ప్రజాశక్తి-రాజాం :  రాజాం మున్సిపాలిటీలో వివిధ నిదులతో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజారోగ్య సాంకేతికశాఖ ఇంజినీర్‌ (విశాఖపట్నం) పి.గణపతిరావు శనివారం పరిశీలించారు. రేగిడి హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ను పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీలో అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌ పనులు , జగనన్న కాలనీలో వాటర్‌ సప్లై పనులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడుతూ అభివృద్ధి పనుల టెండర్లను త్వరితగతిన పిలిచి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయనతో టెక్నికల్‌ ఆఫీసర్‌ కె.ఫణి కుమార్‌, సహాయక ఇంజనీర్‌ వెంకట్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.