ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం నియోజకవర్గంలో టిడిపి నాయకులు కోట జంక్షన్ వద్ద నుండి పైడితల్లి అమ్మవారి కోవెల, గంట స్తంభం జంక్షన్, కన్యకాపరమేశ్వరి అమ్మవారి కోవెల మీదుగా స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ జంక్షన్ వరకు సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










