Sep 12,2023 17:09

ప్రజాశక్తి-విజయనగరం : నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌లో విజయనగరం జిల్లాకు ద్వితీయ స్థానం సాధించింది. రాష్ట్రంలోని 26 జిల్లాలు పోటీలో పాల్గొనగా జిల్లా ద్వితీయ స్థానం సాధించింది. ద్వితీయ స్థానం సాధించిన జిల్లా జట్టును షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి పి.కృష్ణమూర్తి, అసోసియేషన్‌ సభ్యులు ధర్మారావు, ఆనంద్‌, చలం, ప్రసాద్‌లు అభినందించారు.