ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి సూచించారు. నగర పాలక సంస్థ శానిటరీ విభాగంలో కోడూరు లోకేష్, తుపాకుల వెంకటరావు అనే ఇద్దరికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తూ సంబంధిత పత్రాలను మంగళవారం ఆయన అందజేశారు. ఇద్దరికీ పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా నియమించినట్లు ఆయన తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో ఎం హెచ్ ఓ శ్రీరామ్మూర్తి, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










