Aug 29,2023 15:54

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఫోర్ట్సటీ పాఠశాలలో గిడుగు వేంకట రామ్మూర్తి జన్మదినం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగు భాషా వారీత్సవాలు జరిగాయి. ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పద్యపఠనం, కథలు - కవితలు, సామెతలు వక్తత్వం, క్విజ్‌, పాటలు తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గిడుగు వేంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా హరే వీసమారా ధనమ్‌' వారు వివిధ పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్‌ పోటీలో ఫోర్ట్సిటీ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను కనబరచి ప్రథమ, ద్వితీయా స్థానాలలో బహుమతులను పొందారు. అదే విధంగా ధ్యాన్‌ చంద్‌ జన్మదినమైన జాతీయ క్రీడాదినోత్సవంలో భాగంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ కె.ఎ.పి. రాజు (శివ) మాట్లాడుతూ.. తెలుగుభాష గొప్పతనం గురించి, క్రీడల వలన కలిగే ప్రయోజనాలు గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్‌ చైర్మన్‌ చంటి, ప్రిన్సిపల్‌ రీయినాఖాన్‌, డైరెక్టర్లు మధు, అశోక్‌, నీలిమ, భాషోపాధ్యాయులు వ్యాయామాపాధ్యాయులు పాల్గొన్నారు.

4