Aug 19,2023 17:08

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కోరుకొండలో గల ది వైజాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో టిపిఎల్‌ క్రికెట్‌ పోటీలను సైనిక స్కూల్‌ కెప్టెన్‌ ఎస్‌ ఎస్‌ శాస్త్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమని, శారీరక, మానసిక నైపుణ్యాలను నేర్పుతాయి అని అన్నారు. వైజాగ్‌ ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బి. లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. మా పాఠశాల ఆవరణలో మొత్తంగా 10 జట్లు 140 మంది విద్యార్థులతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయనగరం చరిత్రలో మొట్ట మొదటి స్కూల్‌ క్రీడకారులతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. క్రికెట్‌ అనేది విశ్వవ్యాప్తంగా ఒక పండుగ దీనికి జాతి, మత, ప్రాంతీయ బేదాలు లేవని అన్నారు. క్రికెట్‌ ఒక ఆటగానే కాకుండా దాని నుంచి రకాలైన ఆరోగ్యనియమాలు, సోషల్‌ స్కిల్స్‌. విద్యార్థులు వివిద టీమ్‌ వర్క్‌, మానసిక అభివద్ది మొదలగు నైపుణ్యాలను అలవర్చుకోవచ్చు అని అన్నారు. పాఠశాల డైరెక్టరు టి. వీరాస్వామి మాట్లాడుతూ విద్యార్థులకు అబ్యసనా కార్యక్రమాలతో పాటుగా క్రీడా నైపుణ్యాలను కూడా నేర్పుతామని చెప్పారు. ఈ టోర్నీలో 56 మ్యాచ్‌ల వరుకు నిర్వహిస్తామని.. డిసెంబర్‌ - 16న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులకు పాఠశాల చైర్మెన్‌ సీతయ్య అభినందనలు తెలిపారు. కార్యక్రమములో వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీను, స్వప్న, బోదనా సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

2