Sep 07,2023 17:22

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :రాష్టంలో ఉన్న 26 జిల్లాల ఎన్‌ జి ఎస్‌ జిల్లా కోర్డినేటర్‌ లు, క్లస్టర్‌ కోఆర్డినేటర్‌ లకు ఢిల్లీ లో ఉన్న ఏకో ఇండియా ,నేషనల్‌ గ్రీన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో పర్యావరణం మీద రెండు రోజుల శిక్షణా తరగతులు విశాఖపట్నం లో పౌర గ్రంధాలయం లో గురువారం నుంచి ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులు రెండు రోజులు జరుగుతాయి. కార్యక్రమం లో అర్‌ జె డి జ్యోతి కుమారి, డిప్యూటీ డీ ఈ ఓ గౌరీశంకర్‌ , ఏకో ఇండియా అధినేత దీపిక జా,రాష్ట్ర కో ఆర్డినేటర్‌ పి నీలకంఠ, జిల్లా ఎన్‌ కి సి కోఆర్డినేటర్‌ బి. వేణుగోపాల్‌ రావు పా ల్గొన్నారు. కార్యక్రమం లో పర్యావరణ హితం కోసం పాఠశాల లో నిర్వహించవలసిన కార్యక్రమాలు మరియు వాటిని అమలు చేయవలసిన విధానాలు గురించి ఉపాధ్యాయులకు తెలియ చేసారు. ప్రస్తుత పరిస్థితులు లో ప్రతి ఒక్కరు పర్యా వారణానికి అనుకూలమైన జీవన పద్ధతులు అవాలంభించి జీవ వైవిధ్యానికి సంరక్షణ చేయాలని సూచించారు. కార్యక్రమం లో వివిధ సేంద్రియ ఉత్పత్తులు మరియు ఔషాద మొక్కలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం లో పర్యావరణ సంరక్షణ మీద మన్యం జిల్లా కోఆర్డినేటర్‌ జి. రాజు గీసిన వివిధ పెయింటింగ్స్‌ ప్రదర్శించారు.