Sep 09,2023 15:37

ప్రజాశక్తి....విజయనగరం టౌన్‌ :శనివారం స్థానిక విజ్జి స్టేడియంలో జరిగినటువంటి జిల్లా అథ్లెటిక్స్‌ జట్టు ఎంపికలు కు క్రీడాకారులు నుంచి విశేషమైన స్పందన వచ్చింది. అథ్లెటిక్స్‌ ఎంపికలనుజిల్లా అథ్లెటిక్స్‌ సంఘ సభ్యులందరూ కలిపి జండా ఊపి ప్రారంభించారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుండి సుమారు 500 మంది అథ్లెట్స్‌ పాల్గొన్నారు. ఎంపిక పోటీలలో పరుగు,లాంగ్‌ జంప్‌,హై జంప్‌,డిస్కస్‌ త్రో,షాట్‌ పుట్‌ వంటి అంశాల్లో ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈనెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఏలూరు ఏఎస్‌ఆర్‌ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నామని జిల్లా అథ్లెటిక్స్‌ సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ అఫీషియల్స్‌ గా వ్యాయామ ఉపాధ్యాయులు గౌరీ శంకర్‌, తవిటి నాయుడు, ఆనంద్‌ కిషోర్‌ ,గణేష్‌, బాబ్జి, రామకఅష్ణ ,గురు నాయుడు, వ్యవహరించారు సీనియర్‌ క్రీడాకారులు శ్రీనివాస్‌, కోచస్‌ శ్రీకాంత్‌, మధు, నర్సింగ్‌, శివ, లక్ష్మణ, శేఖర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.