Sep 05,2023 15:26
  • 71 మంది ఉపధ్యాయులకు సత్కారం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : డా.సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జరుగుతున్న ఉపాద్యాయ దినోత్సవం వేడుకలు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.మంగళవారం ఉపాద్యాయ దినోత్సవ వేడుకలు జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కలెక్టర్ నాగలక్ష్మి,మేయర్ విజయలక్ష్మి లు నివాళులు అర్పించారు.అనంతరం జిల్లా విద్యా శాఖ అధికారి బి లింగేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఉపాద్యాయ దినోత్సవం అంటే గురువులు గుర్తు చేసుకోవడంతో పాటు,వారు అనుసరించిన సన్మార్గంలో నడిపించడానికి చూపే మార్గమన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆర్ధిక కారణాలతో విద్యకు పేద విద్యార్దులు దూరం కాకూడదని అమ్మఒడి,విద్యా దీవెన,వసతి దీవెన,విదేశీ విద్యా దీవెన వంటి పథకాలు ద్వారా ఆర్దికంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. వీటితో పాటు పాఠ్య పుస్తకాలు,యూనిఫార లు, నాడు నేడు ద్వారా పాఠశాలల్లో తరగతి గదులు,ఫర్నిచర్,మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.రెండో విడత నాడు నేడు పనులు శరవేగంగా జిల్లాలో జరుగుతున్నాయన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమైన ఆంగ్ల విద్యా, సి బి ఎస్ ఈ సిలబస్ ను ప్రభుత్వ విద్యా సంస్థలు లో అమలు చేయడం జరుగుతుందన్నారు. భావి భారత పౌరులు ను దేశానికి అందించే గురువులు విద్యార్దులను మానసికంగా వారిలో ఏపని అయినా చేయగలం అనే నమ్మకాన్ని వృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు.విద్యార్దులకు ఏ అంశాల్లో నై పుణ్యం ఉందో దానిని గ్రహించి ప్రోత్సహించి నప్పుడు వారు అనుకున్నదా నిని సాధించుకొగలరన్నారు. పిల్లలు అందరూ ఒకే విధంగా స్పందించే గుణం ఉండదు దానిని తెలుసుకొని వారిని ప్రోత్సహించినప్పుడు మెరుగైన ఫలితాలు సాధించవచ్చున్నన్నారు. అటువంటి కర్తవ్యం ఉపాధ్యాయులదేనన్నారు. పిల్లలపై తల్లి తండ్రులు ప్రాభవం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుంది,90 శాతం గురువు నేర్పిన విద్యా విధానం ప్రభావం చూపుతుందని అన్నారు. ఉత్తమ పౌరులను అందించేది గురువెనని ఎటువంటి గురువును సత్కరించి కోవడం సమాజ బాధ్యత అన్నారు. మెరుగైన విద్యా ప్రమాణాలు అందించే విధంగా నేటి ఉపాద్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించు కునే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. ఉపాధ్యాయులే సమాజానికి మార్గదర్శకులు అని కొనియాడారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి గణపతి,డీ ఈ ఓ లింగేశ్వర రెడ్డి ఉపాద్యాయులు సేవలను గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను 12 మంది ప్రధానోపాధ్యాయులు ను,14 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాద్యాయలను,29 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులను, సెంటా విభాగంలో మరో నలుగురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాద్యాయ అవార్డు ద్వారా జిల్లా కలెక్టర్,మేయర్, డీఆర్వో చేతులు మీదుగా సత్కరించారు. కార్యక్రమంలో డెప్యూటీ డీ ఈ ఓ లు వాసుదేవరావు,బ్రహ్మాజీ, డైట్ ప్రిన్సిపాల్ సత్యనారయణ ఉపాద్యాయులు,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.