Sep 09,2023 11:41

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా బస్సులు ఆర్టీసీ అధికారులు నిలుపుదల చేయడంతో ప్రయాణికులు ఒకింత గందరగోళం పడ్డారు.అలాగే ఆర్టీసీ ఉద్యోగులు అందరూ వేకువజామున నుంచి విదులకు వచ్చిన తర్వాత ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు బస్సులను నిలుపుదల చేయాలని చెప్పిందన్నారు. కంగుతిన్న ఉద్యోగులు గత్యంతరం లేక డిపోలోనే ఉన్నారు. ఇదే అదునుగా చూసుకున్న ఆటోడ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు.