ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శ్రీ కష్ణ జన్మష్టమి సంబరాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం విజయనగరం కొత్తపేట, రాధ కృష్ణ యాదవ కళ్యాణ మండపంలో, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తిరుమల మెడికవర్, స్వామి కంటి ఆసుపత్రి డాక్టర్స్, సిబ్బంది, గైనిక్, షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్య పరీక్షలు 188 మంది, బీపీ, షుగర్, గైనిక్ పరీక్షలు 108 మందికి నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, 48 మందికి కాటరక్ట్ ఆపరేషన్స్ చేసినందుకు స్వామి కంటి ఆసుపత్రి ముందుకు వచ్చినట్లు తెలిపారు. తిరుమల మెడికవర్ వారు తమ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు నిర్వహించడం కోసం ప్రత్యేకంగా కార్డులు అందజేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ కృష్ణ శాంతి, విజయనగరం మునిసిపల్ మాజీ ఛైర్పర్సన్ ప్రసాదుల కనక మహాలక్ష్మి, జిల్లా యాదవ సంక్షేమ సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు మన్యాల కృష్ణ, ముచ్చి రామలింగ స్వామి తో పాటు సంఘ నాయకులు హాజరయ్యారు. ఈ వైద్య శిబిరాన్ని, యాదవ మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత యాదవ్ పర్యవేక్షణ చేశారు.










