ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు. ఆజాదీ క అమృత్ మహౌత్సవాలలో భాగంగా అయ్య కోనేరు గట్టు ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మేరీ మిట్టి, మేరీ దేశ్ నినాదంతో మొక్కలు నాటి వాటి సంరక్షణను బాధ్యతగా చేపట్టాలని కోరారు. దేశ రక్షణలో అసువులు బాసిన నగరానికి చెందిన రౌతు జగదీష్ స్మారకార్థం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ దేశ రక్షణ, అభివఅద్ధి పట్ల ప్రతి భారతీయుడు పాటుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. 350 వరకు మొక్కలను నాటడం జరిగిందని, వాటిని పరిరక్షించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. నగరంలో చెరువులు, పార్కులు, జంక్షన్లను అభివఅద్ధి పరిచామన్నారు. అయ్య కోనేరును అందాల కోనేరుగా తీర్చిదిద్దామన్నారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రక్ ను నిర్మించామని, అలాగే విద్యుత్ దీపాలు అమర్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ శ్రీరాములు నాయుడు, రౌతు సింహాచలం, సరస్వతి, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండల డైరెక్టర్ బంగారు నాయుడు, వైసిపి నాయకులు నాయన మహేష్ తదితరులు పాల్గొన్నారు.










