Sep 08,2023 15:49

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఒంగోలులో జరుగుతున్న రాష్ట్ర అండర్‌ 13 బాల,బాలికల బాడ్మింటన్‌ పోటీలకు విజయనగరం నుంచి ఎం. జాన్సనే, సి హెచ్‌ హిమతేజ, ఎస్‌. లికిత్‌, ఎం డి నిషిథ ఫాతిమా, ఎస్‌.లాస్య పాల్గొన్నారు. వీరిని డిప్యూటి స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, డా.విఎస్‌ ప్రసాద్‌, ఎంకెబి అభినందించారు. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించాలని కార్యదర్శి వై.కుసుమ బచ్చన్‌ ఆకాంక్షించారు.