Aug 26,2023 16:26

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మదర్‌ థెరిసా 113వ జయంతి, మదర్‌ థెరిసా సేవా సంఘం అండ్‌ బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ ఆర్గనైజేషన్‌ 6వ వార్షికోత్సవం సందర్భంగా, అయ్యన్నపేట జంక్షన్‌లోని మదర్‌ థెరిసా కిడ్స్‌ స్కూల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌ విద్యార్థులకు నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిల్‌లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్‌ పట్నాయక్‌, సేవా సంఘం గౌరవ అధ్యక్షులు త్యాడ వేణుగోపాలం, సంఘ సభ్యులు నూతన్‌, శ్రీనివాస్‌, శ్రావణి సుజాత తదితరులు పాల్గొన్నారు.