ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం పార్వతీపురం మన్యం గిరిజన సంక్షేమ (ఐటిడిఎ) పరిధిలో ఉన్న వసతి గృహాలకు ''డైట్ బిల్లులు'' చెల్లించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. సోమవారం స్పందనలో జాయింట్ కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అద్యక్షులు పల్ల సురేష్, నాయకులు సీహెచ్ సీతారాం, బి జుజిస్ట్, యం శివ, యం రామరాజు, విద్యార్థులు శ్రావణి, లలిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.










