ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రజలపై ట్రూ ఆఫ్ చార్జీల పేరుతో 6వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలు భారాలు వేశారని తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం విజయనగరం ఆర్డీవో కార్యాలయం ప్రక్కన గల సబ్‌స్టేషన్ వద్ద వద్ధ విద్యుత్ బిల్లులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు ఫలితంగా ధరలు రోజురోజుకి పెరుగుతూ పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఆర్దిక ఇబ్బందులకు కారణమవుతున్నాయన్నారు. ఇప్పటికే ప్రజలు పెరిగిన ధరలతో శతమతమవుతుంటే ఇవి చాలదన్నట్లు మూలుగుతున్న నక్క పైన తాటిపండు పడినట్లు విద్యుత్ చార్జీలను కూడా పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కావున పెరిగినధరలు తగ్గించాలని, కోరుతూ సిపిఎం సమర భేరి కార్య క్రమాలు, నిరసన ధర్నాలు, వినతి పత్రాల సమర్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ , సిఐటీయూ నాయకులు కంది త్రినాథ్, కానూరు రమణ, శేకర్,గోపి, తదితరులు పాల్గొన్నారు.










