Aug 26,2023 20:49

గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న కళాశాల ప్రతినిధులు

ప్రజాశక్తి- గరివిడి : స్థానిక అవంతీస్‌ సెయింట్‌ థెరిస్సా ఇంజనీరింగ్‌ కాలేజీ, విజయనగరం ఎపిఎస్‌ఎస్‌డిసి సంయుక్తంగా కాలేజీలో ఈ నెల 29న ఉదయం మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.జాషువ జయప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు కళాశాలలో శనివారం జాబ్‌మేళాకు సంబంధిం చిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్‌ మేళాలో ఐ.టి, మ్యానుఫ్యాక్చరింగ్‌, ఫార్మా, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ తదితర రంగాలకు సంబంధించి టెక్‌ మహేంద్ర, వైఎస్‌కె ఇన్పో Ûటెక్‌ ప్రయివేటు లిమిటెడ్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, హేటరో డ్రగ్స్‌, జయభేరి ఆటోమోటివ్‌ ప్రయి వేటు లిమిటెడ్‌, సైనప్టిక్స్‌ లాబ్స్‌ అల్ట్రాటెక్‌ సిమ్మెంట్‌ లిమిటెడ్‌, వరుణ్‌ మోటార్స్‌ వంటి వివిధ 16 కంపెనీలకు జాబ్‌ మేళా నిర్వహిస్తు న్నామన్నారు. చీపురుపల్లి, గరివిడి, మెరక ముడిదాం, గుర్ల, నెల్లిమర్ల, విజయనగరం, రాజాం, లావేరు తదితర పరిసర ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఐటిఐ, డిప్లొమా, బిటెక్‌, ఏంటెక్‌, ఎంబిఏ, ఏంసిఏ, ఫార్మసీ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం 6300495265,8886287495 ఫోన్‌ నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌.ప్రిన్సిపాల్‌ బి. వెంకటరమణ, ఏ.ఓ జి.అనిల్‌ కుమార్‌, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.