ప్రజాశక్తి-పెరవలి : ముక్కామల శాఖా గ్రంధాలయంలో గురువారం "వేసవి విజ్ఞాన శిబిరం"18వ రోజులో భాగంగా ఉదయం 8 గంటలనుండి రిసోర్స్ పర్సన్ ఏ.అస్మిత విద్యార్థులతో నీతి కథలు చదివించడం పుస్తక సమీక్ష చేయించడం అయినది కే. వెంకటేశ్వర్లు ఇంగ్లీష్ స్టోరీ పుస్తకాలు చదివించారు ఉపాధ్యాయులు కే.ప్రసాద్ విద్యార్థులకు సౌర కుటుంబంలో భూమి గురించి తెలియజేసి క్విజ్ పోటీ నిర్వహించారు. విరామ సమయంలో విద్యార్థులకు కేక్స్ అందజేశారు. అనంతరం కరటూరి విశ్వనాధం విద్యార్థులతో యోగా చేయించి క్యారమ్స, చెస్ , ఆడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 26 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు గ్రంథపాలకులు ఎం. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.










