ప్రజాశక్తి-గోపాలపురం సగ్గొండ పంచాయతీ గంగోలు రెవెన్యూ పరిధిలో ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయక పోవడంతో గ్రామస్తులు గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దేవరపల్లి సిఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్‌క్ష్మి కె.రామకృష్ణ తమ సిబ్బందితో పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ గోపవరం గ్రామానికి అతి సమీపంలో నిర్మాణం చేస్తున్న ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఈ నెల 20న పెద్ద ఎత్తున నిరసన తెలిపామన్నారు. గోపాలపురం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి గురువారం సభ ఏర్పాటు చేస్తామని తెలిపారని, కానీ గ్రామసభ ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సర్పంచ్ ఎండపల్లి శేఖర్ బాబు, పంచాయతీ కార్యదర్శి అనురాధ, ఫార్మా కంపెనీ యాజమాన్యం సమక్షంలో గ్రామస్తులతో చర్చలు ఏర్పాటు చేశారు. గ్రామసభ వచ్చేనెల 5న ఏర్పాటు చేస్తామని ప్రజాభిప్రాయలు, తుది నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.










