ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ప్రాంతీయ అటవీ పరిశోధనా సంస్థ డివిజనల్ ఫారెస్ట్ రిసెర్చ్ సెంటర్, స్టేట్ సిల్వి కల్చరిస్ట్ షేక్ సలాం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై బుధవారం అవగాహన కారక్రమం నిర్వహించారు. హకుంపేటలోని స్థానిక సిద్దార్థ క్యాంపస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పర్యావరన పరిరక్షణలో అందరు భాగస్వామ్యులు కావా లన్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ మొక్కలు పెంచాలన్నారు. పిల్లలకు మొక్కలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు డి.ఆశరేఖ మాట్లాడారు. పర్యవరణాన్ని కాపాడేందుకు మన వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ప్లాస్టిక్ వాడకంతో కాలుష్యం మరింత పెరుగు తుందన్నారు. వాటి వల్ల పర్యావరణానికి ఆటంకం కలుగు తుందన్నారు. తద్వారా భావితరాలకు అవసరమైన భూగర్భ జలాలు లభ్యత చేకూరాదన్నారు. గాలి కాలుష్యం, ధ్వని కాలుష్య వల్ల తీవ్రమైన అనారోగ్యాలు దారితీస్తాయన్నారు. పర్యా వరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలన్నారు. కుటీర పరిశ్ర మలు, బొమ్మలు తయారీ, నేత వస్త్రాలు, వంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. ఈ కార్య్రమంలో ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి, ప్రిన్సిపల్ మల్లేశం, ఉపాధ్యాయులు అర్చన, మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.










