- పాల్గొన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరులో శ్రీ కాశీ విశ్వనాథ హనుమత్సహిత సీతారామ లక్ష్మణ స్వామి వార్ల సహిత శ్రీ మత్కన్యకా పరమేశ్వరి అమ్మవారి స్వర్ణత్సవ సందర్భంగా నిర్వహించిన మహా కుంభాభిషేకంలో శనివారం రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా గణపతి, నవగ్రహ పున: ప్రతిష్ట మరియు చతుషష్టి కలార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాప్తాడు మండలం యం. కృష్ణాపురం గ్రామంలో శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్టా మహా ఉత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.










