మెరుగైన విద్యను అందించడానికే ట్యాబుల పంపిణీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి
మెరుగైన విద్యను అందించడానికే ట్యాబుల పంపిణీ
డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి
ప్రజాశక్తి -గంగాధర నెల్లూరు: రాష్ట్రంలో విద్యాభివద్ధి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కషి వాటి ఫలితాలు 20ఏళ్ళ తర్వాత కనబడతాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. గంగాధర నెల్లూరు హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లను గురువారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మరింత మెరుగైనవిద్యను అందించడానికి బైజ్యూస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని 8వతరగతి నుండి విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కషి చేస్తున్నదని అన్నారు. ఇతరదేశాల్లో కోవిడ్ మళ్లీ విజంభిస్తుందన్నదని సమాచారం తెలుసుకోవడం జరిగిందని, అందువలన ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని విన్నవించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్టీసీ వైస్‌చైర్మన్ ఎంసి.విజయానందరెడ్డి, పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి, డీఈవో విజయేంద్ర రావు, ఎంపీపీ అనిత, మండల వైసీపీ కన్వీనర్ పూర్ణచంద్రారెడ్డి, ఎంపీడీవో శ్రీదేవి, తాసిల్దార్ ఇన్భనాధన్, ఎంఈఓలు రాజేంద్రన్, రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శాంతిపురం: ప్రతిఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదివి జగనన్న ఆశయాలను నెరవేరాలని జడ్పీటీసీ సభ్యులు శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని మట్టం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బైజూస్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోదండరెడ్డి, మండల కన్వీనర్ బుల్లెట్ దండపాని, ఎంపీడీఓ హేమమ్మలిని, ఎంఈఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
బైరెడ్డిపల్లి: గురువారం బైరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్‌లో 8వ తరగతి విద్యార్థులకు చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ జి.శ్రీనివాసులు (వాసు) , పలమనేరు ఎమ్మెల్యే ఎన్.వెంకటే గౌడ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ట్యాబులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి రెడ్డప్ప, జెడ్‌పిటిసి కేశవులు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.










